Header Banner

పవన్ ఇంటికి అల్లు అర్జున్.. ఇన్నాళ్లు కొట్టుకున్న ఫ్యాన్స్ ఏమైపోతారో..! ఫ్యామిలీ అంతా ఒక్కటేనా?

  Tue Apr 15, 2025 08:21        Politics

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు.పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు మాట్లాడినట్లు సమాచారం. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్‌ను పరామర్శించారు. చిన్నారి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!


కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే, ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లి తన కుమారుడిని చూడటం జరిగింది. గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్‌ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు పవన్. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తన భార్యతో కలిసి వెళ్లి మరీ మార్క్ శంకర్‌ను పరామర్శించడం జరిగింది. ఇదిలా ఉంటే మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.పుష్ప-2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ , మెగా హీరోలెవ్వరూ కూడా స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్‌గానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ బ్లాక్ చేయడం, పుట్టిన రోజుల సందర్భంగా విషెష్ చెప్పుకోకపోవడంతో, వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్టు అయింది. పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ వచ్చినప్పటికీ, అల్లు అర్జున్‌ను కలవకుండానే వెనుతిరిగారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అతన్ని కుమారుడిని పరామర్శించడం హాట్ టాపిక్‌గా మారింది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AlluArjun #PawanKalyan #MegaFamily #FanWars #MarkShankar #BunnyMeetsPawan